- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :అమెరికాలోని మేరీల్యాండ్‌లో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నామని, కాలుష్య రహిత ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలకు పిలుపునిచ్చారు.
- Advertisement -



