Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి 

కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి 

- Advertisement -

తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లం ఎల్లయ్య
నవతెలంగాణ – నెల్లికుదురు 

గ్రామపంచాయతీ సిబ్బందికి మూడు నెలల బకాయి పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ ముట్టడి చేస్తున్నామని దీనికి అందరు తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అడ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లం ఎల్లయ్య కోరినట్లు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన మహబూబాబాద్  జిల్లాలో ఈనెల 23న ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

ఈ ధర్నా బకాయిపడిన మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని, ఆన్లైన్లో నమోదు కాని సిబ్బందిని నమోదు చేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం అమలు చేయాలని, మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, జిఓ 51 సవరించాలని, పంచాయతీ సిబ్బందిని పిఆర్సి పరిధిలోకి తీసుకొని వేతనాలను పెంచాలని, కారోవార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని, నూతనంగా వచ్చిన సర్పంచ్ ల వేధింపులు తొలగింపులు ఆపాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కావున జిల్లాలోని పంచాయతీ సిబ్బంది అందరూ హాజరై విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు మారబోయిన శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి బి వెంకన్న, సహాయ కార్యదర్శి మయ్య రాము, ప్రచారకర్త రామ్ కోటి, కోశాధికారి సుభాన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -