Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంకప్ అథ్లెటిక్స్‌లో భూపాలపల్లి క్రీడాకారుల మెడల్స్ పంట

సీఎంకప్ అథ్లెటిక్స్‌లో భూపాలపల్లి క్రీడాకారుల మెడల్స్ పంట

- Advertisement -

విజేతలకు మెమొంటోలు, సర్టిఫికెట్ల ప్రధానం
నవతెలంగాణ – కాటారం 

రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్ క్రీడా పోటీల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించడం పట్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య, కార్యదర్శి పూతల సమయ్యలు హర్షం వ్యక్తం చేశారు. హనుమకొండ జవహర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో అండర్–16 షాట్‌పుట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన సమన్విత, అండర్–18 లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన అన్వితతో పాటు పలు విభాగాల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ఈరోజు మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు క్రీడా మౌలిక వసతుల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ సారంగపాణి మాట్లాడుతూ, రాష్ట్ర నలుమూలల నుంచి 1600 మంది అథ్లెట్లు పోటీల్లో పాల్గొని ప్రతిభను ప్రదర్శించారని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి, డివైస్ ఓ అశోక్, క్రీడాభిమానులు నవీన్ రావు, రామ్ నారాయణ, మధుకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొని విజేతలైన క్రీడాకారులను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -