Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చాకలి కులస్తులపై అగ్ర కులస్తుల దాడిని ఖండిస్తున్నాం

చాకలి కులస్తులపై అగ్ర కులస్తుల దాడిని ఖండిస్తున్నాం

- Advertisement -

రజక సంఘం మండల అధ్యక్షుడు ఓదెలు
నవతెలంగాణ – మల్హర్ రావు

చాకలి కులస్తులైన రజకులపై రెడ్డి కులస్తుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా రజక సంఘం మండల అధ్యక్షుడు పావురాల ఓదెలు తెలిపారు. ఆదివారం మండలంలోని కొయ్యుర్ లో విలేకరులతో మాట్లాడారు. రజక కులస్తులు భారతదేశంలో మనిషి పుట్టినకాన్ని మొదలు పెడితే చనిపోయేవరకు సేవ చేసే కులమన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మూడు రోజుల క్రితం సాకలి కులస్తులు ఐన గణేష్ చంద్రకళ మౌనికపై అదే గ్రామ సర్పంచ్ తుకారం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి తోపాటు రెడ్డి వర్గం అంతా రాయలేని భాషతో బూతులు తిడుతూ దురంకారంతో అతికిరాతకంగా భయంకరంగా వారిపై దాడి చేసి, రెండు నెలల పసిబిడ్డపై కాళ్లతో తన్ని చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రెడ్ల అహంకార సంఘటనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు త్రీవంగా ఖండిస్తున్నారని తెలిపారు. తమకు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘ నాయకులు అందరూ సాకలి కుటుంబానికి అండగా ఉండాలని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -