Sunday, February 22, 2026
E-PAPER
Homeఖమ్మంపేట మున్నూరు కాపులు కాంగ్రెస్ కే వెన్నుదన్ను: ఎమ్మెల్మే జారె

పేట మున్నూరు కాపులు కాంగ్రెస్ కే వెన్నుదన్ను: ఎమ్మెల్మే జారె

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపల్ ఛైర్పర్సన్,వైస్ ఛైర్పర్సన్ లు గా భార్యా భర్త లే ఎన్నిక కావడం రాష్ట్రంలోనే మొత్తం చర్చనీయాంశం అయిందని ఎమ్మెల్యే జారె అన్నారు. ఆదివారం మండలంలోని సత్య సాయి కళ్యాణ మండపంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు కురిశెట్టి నాగబాబు అధ్యక్షతన చేపట్టిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు తో ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆదరణ దక్కాలంటే గెలుపొందిన ప్రతీ వార్డ్ కౌన్సిలర్ అకుంఠిత దీక్షతో పనిచేసిన నాడే ఆదరణ దక్కుతుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడటం ఈ మున్సిపాలిటీ ని గెలిపించుకోవడం తనకు పెద్ద టాస్క్ గా మారిందన్నారు. గెలుపు గుర్రాల కి సీట్లు కేటాయించి గెలిపించుకున్నామన్నారు. అందులో భాగంగానే పట్టణంలో బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపులకు ఆరు సీట్లు కేటాయించగా 100% స్ట్రైక్ రేట్ తో ఆరింటిని గెలిచి కాంగ్రెస్ కు అండగా నిలబడ్డారన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ విషయంలో భార్యాభర్తలకు ఏ విధంగా రెండు పదవులు కట్టబెడతారని రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిందన్నారు.తాను ఇచ్చిన మాట ప్రకారం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అధిష్టానాన్ని ఒప్పించుకొని మాట నిలబెట్టుకున్నారన్నారు.

ప్రజల ఆదరణ ఉన్నవారికి పదవులు కట్టబెడితే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని వివరించారు.తనకు పట్టణంలో ఉన్న ప్రతి సమస్య తెలుసునని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.అందులో భాగంగానే ఎనిమిదో వార్డులో ఉన్న కమ్యూనిటీ భవనానికి రూ. పది లక్షల రూపాయలు ఎమ్మెల్యే గ్రాంట్ నుండి కేటాయించడం జరిగిందన్నారు.అదేవిధంగా హైస్కూల్లో విద్యార్థులకు ట్రైనింగ్ హాల్ కోసం రూ. 25 లక్షలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. మున్సిపాలిటీ ఫర్నిచర్ కోసం ఎమ్మెల్యే గ్రాంట్ నుండి రూ.25 లక్షల శాంక్షన్ చేసి ఫర్నిచర్ అందించడం జరుగుతుందన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ కొందరు పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడమే పనిగా పనిచేస్తున్నారని రాజకీయ విమర్శలు అనేవి ఎన్నికల వరకే ఉండాలన్నారు.ప్రజలకు అండగా ఉంటూ పని చేసుకుంటూ పోతే ఆ పనులే సమాధానం చెబుతాయని స్పష్టం చేశారు.

ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై ఆదరణ పెరగటంతో ప్రతిపక్ష పార్టీలకు కంటిపై కునుకు లేకుండా పోతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ, వీరబాబు మున్నూరు కాపు వార్డు కౌన్సిలర్లు ఆరుగురికి, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, వైస్ సర్పంచుల కు సాలువాలతో సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు నాయుడు, స్టేట్ బాపట్ల మురళి, మున్సిపల్ చైర్ పర్సన్, జూపల్లి శశికళ, వైస్ చైర్ పర్సన్ జూపల్లి రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, తుమ్మ రాంబాబు, చిన్నంశెట్టి సత్యనారాయణ, పాశం రామారావు, తాడేపల్లి రవి, బండారు శ్రీనివాసరావు, కట్ట శ్రీను, కొల్లు నాగు, సురేష్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -