కేజీకేఎస్ కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ
నవతెలంగాణ – నెల్లికుదురు
కల్లుగీత కార్మిక సంఘం సభ్యుల సమస్యలు తక్షణ పరీక్షించి పెండింగ్లో ఉన్న ఎక్స్ గ్రేషియా ను వెంటనే అందించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం వి రమణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకటేశ్వర్లు డిమాండ్ చేసినట్టు తెలిపారు. ఆదివారం వావిలాల గ్రామంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి సమావేశం లో మాట్లాడారు. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న బహుజన వీరుడు బహుజనులను కలుపుకొని 12 మంది సైన్యం ఏర్పాటు చేసుకొని వారితోపాటు 200 మంది సైన్యాన్ని కలుపుకొని కోటాలను చేయచుకుంటూ పేదల పక్షం నిలబడి పోరాడిన మహానుభావుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. ఆయన విగ్రహాన్ని ఈ వావిలాల గ్రామంలో ఏర్పాటు చేసుకొని కులస్తులు కుల బాంధవుల ను పిలుచుకొని అంగరంగ వైభవంగా ఆ గ్రామంలో పండుగ వాతావరణ లో నెలకొన్న విధంగా కులస్తు లతో విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
ఈ విగ్రహ దాత కందిమల్ల సతీష్ స్టేజి దాదా నరేష్ లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి గౌడ కులస్తుల కు మీ వంతు సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు అని అన్నారు. పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే ఇవ్వకపోతే త్వరలోనే అసెంబ్లీ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. గౌడ కులస్తులకు పెన్షన్ సేఫ్టీ మోకు బ్యాంకులో రుణాలు అందించి వారి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. గౌడ కులస్తులు అన్ని రంగాల్లో ముందుండి పోరాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో,జిల్లా అధ్యక్షుడు గౌని వెంకన్న ,కార్యదర్శి యమగాని వెంకన్న, మండల అధ్యక్షుడు వీరగాన్ని మల్లేశం గౌడ్ ,మండల ప్రధాన కార్యదర్శి
శీలం సత్యనారాయణ, ఆ గ్రామ సొసైటీ అధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నాయకులు సురుగు రాజేష్, పెరుమళ్ళ వెంకన్న ,గొల్లపెల్లి యాదగిరి,రాగిపెల్లి వెంకటేశ్వర్లు, బైరు యుగంధర్,నల్లమాస సోమన్న,మద్దెల శోభన్ బాబు ,దేశగాని యాకయ్య,బిక్షం, శ్యాముకూరి వెంకన్న,తాళ్ల వీరయ్య,గుండగాని చిన్న వెంకన్న,మద్దెల రాజేష్ నల్ల మాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



