Monday, February 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'జై హనుమాన్‌' మొదలైంది

‘జై హనుమాన్‌’ మొదలైంది

- Advertisement -

పాన్‌-ఇండియన్‌ బ్లాక్‌బస్టర్‌ ‘హనుమాన్‌’ చిత్రాన్ని అందించిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, దీనిని టి-సిరీస్‌ సమర్పిస్తుంది. రిషబ్‌ శెట్టి ఆంజనేయ స్వామిగా నటిస్తున్నారు. ఆధునిక కథనాలను పురాణ అంశాలతో సమ్మిళితం చేస్తూ అద్భుతమైన, వినూత్నమైన కథలతో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్‌ తమ బ్లాక్‌బస్టర్‌ విజయ పరంపరను కొనసాగిస్తోంది. ‘కాంతార చాప్టర్‌ 1’ తర్వాత దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న రిషబ్‌ శెట్టి ఈ చిత్రంలో నటించడం అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రాన్ని ఆదివారం విజయనగరంలోని హంపిలోని అంజనాద్రి బెట్టలో ఘనంగా ప్రారంభించారు.

ఈ పవిత్ర స్థలం హనుమంతుడి జన్మస్థలంగా విశ్వసించబడుతుంది. టీ-సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌ క్లాప్‌ కొట్టగా, అనిల్‌ థడాని ఫస్ట్‌ షాట్‌కు కెమెరా రోల్‌ చేశారు. ‘హనుమాన్‌’ హీరో తేజ సజ్జా తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. అనిల్‌ థడాని, భూషణ్‌ కుమార్‌, నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌ కలిసి దర్శకుడు ప్రశాంత్‌ వర్మకు స్క్రిప్ట్‌ను అందజేశారు. ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలుకానుంది. ‘జై హనుమాన్‌’ కలియుగం నేపథ్యంలో రూపొందుతున్న హై-ఆక్టేన్‌ యాక్షన్‌ ఎపిక్‌. హనుమంతుడి మౌనం ఓటమి కాదు, ఒక లక్ష్యంతో కూడిన నిశ్చలత అని, సమయం వచ్చినప్పుడు వెలుగులోకి వచ్చే అపార శక్తిని ప్రతిబింబిస్తుంది, అచంచల భక్తి, విశ్వాసం, శాశ్వత బలానికి నివాళిగా ఈ సినిమా నిలవనుంది. ఈ చిత్రానికి డిఓపి: ఎస్‌ తిరునావుక్కరసు, సంగీతం: ఎం.ఎం. కీరవాణి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: శ్రీనాగేంద్ర తంగల.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -