Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరెవెన్యూ శాఖలో అన్ని స్థాయిల్లో పదోన్నతులు కల్పించాలి

రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిల్లో పదోన్నతులు కల్పించాలి

- Advertisement -

– రాష్ట్రంలో రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలి : డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర స్థాయి సమావేశంలో తీర్మానాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భూ పరిపాలనలో కాలానుగుణంగా వస్తున్న మార్పులు, భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలనీ, మెరుగైన భూపరిపాలన కోసం ఒక ఆర్‌ అండ్‌ డీ కేంద్రం ఏర్పాటు చేయాలని డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ (తెలంగాణ స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌) అభిప్రాయపడింది. రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిల్లో పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్‌లో ఉన్న సమస్యలను సైతం పరిష్కారం చేయాలని కోరింది. హైదరాబాద్‌లో డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారులుగా పని చేసిన వారికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ, తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లను కొనసాగించాలనీ, వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ, హౌజింగ్‌ సొసైటీ ద్వారా రెవెన్యూ ఉద్యోగులందరికీ ఇండ్ల స్థలాలు వచ్చే దశగా కార్యచరణ అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -