- Advertisement -
కోశాధికారిగా కడారు ప్రభాకర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం(ఐఎస్‌సీయూఎఫ్) జాతీయ అధ్యక్షులుగా మాజీ పార్లమెంటు సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, కోశాధికారిగా హైకోర్టు న్యాయవాది కడారు ప్రభాకర్ రావు ఎన్నికయ్యారు. ఈ మేరకు అజీజ్ పాషా ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 19 20 తేదీల్లో చెన్నైలో జరిగిన జాతీయ 24వ మహాసభల్లో 81 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణకు చెందిన పీవీ దుర్గాప్రసాద్ ఉపాధ్యక్షులుగా, ఆర్ గోపాల్ కార్యదర్శిగా, ప్రొఫెసర్ సారంగపాణి, అవ్వ విజయలక్ష్మి జాతీయ కార్యవర్గ సభ్యులుగా, మద్దినేని రమేష్ బాబు, కొండపర్తి శ్రీనివాసులు జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు.
- Advertisement -



