Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయి కరాటేలో కోనాపూర్ విద్యార్థుల ప్రతిభ

రాష్ట్ర స్థాయి కరాటేలో కోనాపూర్ విద్యార్థుల ప్రతిభ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన మహోదయ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ లో అద్భుత ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల కరస్పాండెంట్ మోర్తాడ్ ఉదయ్, ప్రిన్సిపల్ ఉమేష్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ కేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్ షిప్ లో మహోదయ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 5బంగారు, 8వెండి, 14కాంస్య పతకాలను సాధించి సత్తా చాటారు. అదేవిధంగా ఓవరాల్ పాఠశాల ఛాంపియన్ షిప్ ను కూడా విద్యార్థులు కైవసం చేసుకున్నట్లు వారు తెలిపారు.

సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్ షిప్ లో సత్తా చాటి పథకాలు గెలిచిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ మోర్తాడ్ ఉదయ్, ప్రిన్సిపల్ ఉమేష్ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. ఇందుకు  సహకరించి ప్రోత్సహించిన  ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -