నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సోమవారం జగన్ యువసేన ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్, పెన్నుల వితరణ చేశారు. కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప్లూర్ గ్రామానికి చెందిన జగన్ యువసేన నాయకులు అవారి సుభాష్ నాయకత్వంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ ను, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా అవారి సుభాష్ మాట్లాడుతూ ఈనెల 25 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు జగన్ యువసేన ద్వారా పరీక్ష ప్యాడ్స్ ను, పెన్నులను అందించినట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులై కళాశాలకు, తల్లిదండ్రులకు, కమ్మర్ పల్లి మండలానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలకు 20 డ్యూయల్ డెస్క్ బెంచ్ లు ఇస్తానని హామీ ఇచ్చారు. కళాశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నుల వితరణ చేసిన జగన్ యువసేన సభ్యులకు కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మధు కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జగన్ యువసేన నాయకులు రాజకుమార్, దిలీప్, మహేష్, అనిరుద్, అఖిలేష్, చోటు, నితీష్, అజయ్, రాజేష్, సాయి తేజ, అరవింద్, సందీప్, అక్షయ్, అధ్యాపకులు వైష్ణవి, వెంకటేష్, గంగాధర్, గంగారాం, మహేందర్, శ్రీహరి, మురళీకృష్ణ, ఆనంద్, అనుదీప్ స్వాతి, సుమతి, హర్షిత, తదితరులు పాల్గొన్నారు.



