Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత 

జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు తల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో రైతాంగానికి పెట్టుబడి భరోసా కింద రూ.7500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు పెట్టుబడి భరోసా ఇవ్వలేదని అన్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదని అన్నారు. ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన ముందస్తుగా వరి కొనుగోలు కేంద్రాన్ని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, యూరియా ప్రతి పిఎస్ ఐ సెంటర్ లో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి, హరీష్ రెడ్డి, చిట్టి, భజన రాజు, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -