నవతెలంగాణ – జక్రాన్ పల్లి
అగ్రకుల రెడ్ల దాడిలో మరణించిన బేబీ మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని మండలంలోని కలిగోట్ గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన ర్యాలీ నిర్వహించామని బీఎస్పీ మండల అధ్యక్షుడు ఆరేళ్ల మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా మహెష్ మాట్లాడుతూ .. ఈ నెల 19న నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లిఖార్జున స్వామి జాతరలో అగ్ర కుల రెడ్ల దాడిలో మరణించిన బేబీ మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ దుర్ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని, కుటుబానికి రూ. 1 కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామంలో డా.విశారదన్ మహారాజ్ ఆదేశానుసారం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించామని వెల్లడించారు. ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పి మండల అధ్యక్షులు మహేష్, ధర్పల్లి మండల అధ్యక్షులు మహిపాల్, మండల నాయకులు దిలీప్, కిరణ్, గంగసాయిలు, నర్సయ్య, గంగాధర్, శ్రీనివాస్, సంతోష్, యశ్వంత్, గోపి, రజక కుల సంఘ సభ్యులు మహిళలు పాల్గొన్నారు.
బేబీ మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



