Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపయోగంగా మారిన శ్మశాన వాటికకు జీవం

నిరుపయోగంగా మారిన శ్మశాన వాటికకు జీవం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో స్మశాన వాటికలు ఏర్పాటు చేసింది. అయితే కొన్న గ్రామాల్లో స్మశాన వాటికలో దహన సంస్కారాలు జరుగుతున్నాయి. మండల పరిధిలోని నాయినవాణికుంట గ్రామ పంచాయతీ లో అరేళ్ళ క్రితం గత బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ స్మశాన వాటిక కంపచెట్లు, ముళ్ల పొదలతో నిండి అందులో ఇప్పటి వరకు ఒక్క దాహన సంస్కారం కూడా జరుగలేదు. అప్పట్లో ప్రజా ప్రతినిధులు గాని, గతంలో వున్న సర్పంచి గాని దాని అభివృద్ధి చేయక పోవడంతో కంప చెట్లు, ముళ్ల పొదలు పెరిగి అడవిని తలపించేలా వుంది.

ఇప్పుడు గెలిచిన స్థానిక సర్పంచ్ రమావత్ వినోద్ నాయక్ కంప చెట్లు, ముళ్ల పొదలు తొలగించి మట్టి పోసి అందంగా ముస్తాబు చేసి జీవం పోశారు. త్వరలో విద్యుత్
సౌకర్యం కూడా కల్పిస్తామని సర్పంచ్ చెపుతున్నారు. కనీస సౌకర్యాలైన నీరు, విద్యుత్ సరఫరా, దారి మార్గాలను కల్పిస్తామని సర్పంచ్ చెప్పారు. గత కొద్ద రోజుల క్రితం నాయిన వాణికుంట స్టేజీ నుంచి 3 కిలోమీటర్లు దూరం రోడ్డు పైవున్న ప్రమాదకర గుంతలు, రోడ్డుకు ఇరువైపులా వున్న కంప చెట్లు తొలగించి ప్రమాదాలు జరుగకుండా చేశారు. ఇప్పుడు స్మశాన వాటికను శుభ్రం చేసే పనిలో వున్నారు. దాంతో నాయినవానికుంట తండా గ్రామ పంచాయతీ ప్రజలు సర్పంచ్ పనితీరుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -