Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫిజికల్ సైన్స్ టాలెంట్ లో రాష్ట్రస్థాయి పోటీలకు తాడిచెర్ల విద్యార్థులు

ఫిజికల్ సైన్స్ టాలెంట్ లో రాష్ట్రస్థాయి పోటీలకు తాడిచెర్ల విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఫిజికల్ సైన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 12 మండలాల నుంచి 36 మంది విద్యార్థులకు నిర్వహించిన ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో మండల కేంద్రమైన తాడిచెర్ల హైస్కూల్ విద్యార్థులు గెలుపొంది రాష్ట్రస్థాయి పోటిలకు ఎంపికైనట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు తిరుపతి తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ లో యమ్.డి.శైలాని ప్రథమ, బి.సిరిచందన తృతీయ, పి.వర్దినిని నాల్గవ స్థానాల్లో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంపై విద్యార్థులను హెచ్ఎం, ఉపాధ్యాయులు కుమారస్వామి, వెంకటేశ్వర్లు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -