Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఉప సర్పంచ్

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఉప సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న  కార్యక్రమాలకు ఆకర్షితులమై గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడం కోసమే సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో సొమవారం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎల్లాయిపల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ మీసం మౌనిక రాజు యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ ఇంచార్జ్ మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి చొరవతో పేద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టత కోసం పనిచేస్తు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురావేయడమే లక్షంగా పనిచేయాలన్నారు. బిర్ఎస్ పార్టీకి చెందిన ఉప సర్పంచ్ తో పాటు బొల్లం శ్రీనివాస్ రెడ్డి,,కాసారం రాజిరెడ్డిలకు కాంగ్రెస్ పార్టికండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మన నాయకులు మీసం మహేందర్ యాదవ్,సంద బోయిన పరుశరాములు, పొన్నాల రాజేష్, శ్రీనివాస్ పాకాల భూపతి రెడ్డి,ఉడుత జయంత్, చందు, నముండ్ల వినోద్, వడ్లురి అశోక్,తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -