Tuesday, February 24, 2026
E-PAPER
Homeసినిమాఅందరూ ఎంజాయ్ చేసే సినిమా

అందరూ ఎంజాయ్ చేసే సినిమా

- Advertisement -

హీరో శ్రీ విష్ణు తాజాగా ‘విష్ణు విన్యాసం’తో అలరించబోతున్నారు. యదునాథ్‌ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన సారిక హీరోయిన్‌గా నటించింది. ఈనెల 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు జి.సుమంత్‌ నాయుడు మీడియాతో ముచ్చటించారు. ‘కామెడీ కథలు ఎప్పుడు కూడా విన్నప్పుడు కంటే స్క్రీన్‌ మీదకి వచ్చిన తర్వాతనే కథలో ఉన్న వినోదం ఆడియన్స్‌కి కనెక్ట్‌ అవుతుంది. మా వరకు ఈ కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో, చూసినప్పుడు కూడా అంతే అంతకుమించి ఆస్వాదించాము.

సినిమా చాలా బాగా వచ్చింది. విష్ణు చాలా డైలాగ్స్‌ని స్పాట్‌లో ఇంప్రవైజ్‌ చేస్తుంటారు. అవన్నీ కూడా ఇందులో ఆడియన్స్‌ చాలా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్‌ కాపీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాం. మేము అనుకున్నది స్క్రీన్‌ మీద అద్భుతంగా కన్వే అయింది. ఇది హీరో క్యారెక్టర్‌ మీద నడిచే కథ. దానితో పాటు మరో ఇంట్రెస్టింగ్‌ ట్రాక్‌ ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌ ఉంటుంది. హీరో క్యారెక్టర్‌కి న్యూమరాలజీ అంటే నమ్మకం. ఆ క్యారెక్టర్‌ అద్యంతం అలరించేలా ఉంటుంది. అలాగే హీరోయిన్‌ ట్రాక్‌, రెండు ఫ్యామిలీస్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సారిక చాలా మంచి పెర్ఫార్మర్‌. ఇందులో తన క్యారెక్టర్‌ అద్భుతంగా పెర్ఫార్మ్‌ చేసింది’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -