Tuesday, February 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురూ.192 కోట్ల ధాన్యం కుంభకోణం

రూ.192 కోట్ల ధాన్యం కుంభకోణం

- Advertisement -

నల్లగొండలో ఏడు రైస్‌ మిల్లులపై కేసులు

నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మాల ద్వారా కొనుగోలు చేసి రైస్‌ మిల్లులకు కేటాయిస్తుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌రైస్‌తో పాటు నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని అందించాల్సి ఉన్నా ఇవ్వకుండా వాటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్టు తేలింది. 7 మిల్లుల నుంచి ప్రభుత్వానికి అందాల్సిన రూ.192 కోట్ల ధాన్యం పక్కదారి పట్టినట్టు అధికారుల విచారణలో తేలింది. వాటికి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. 2022-23 రబీకి సంబంధించిన ధాన్యం మిల్లులో కస్టమ్‌ మిల్లింగ్‌ పద్ధతి ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం మినహా మిగిలిన ధాన్యాన్ని గ్లోబల్‌ పద్ధతిన బహిరంగ టెండర్ల ద్వారా ప్రభుత్వం చేపట్టింది.

చిట్యాలలో వరలక్ష్మి రైస్‌ మిల్లు 18132.80 ధాన్యం దిగుమతి చేసుకున్నారు. 30109.91 క్వింటాళ్ల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. అయితే 59538.52 క్వింటాళ్ల ధాన్యాన్ని ఇవ్వకుండా వ్యక్తిగతంగా అమ్ముకున్నట్టు అధికారుల విచారణలో తేలింది. నల్లగొండ పట్టణంలో రామ్‌ లక్ష్మణ్‌ ఇండస్ట్రీస్ 443305.60 క్వింటాళ్ల ధాన్యం కేటాయించగా 78300.36 సీఎంఆర్‌ బియ్యం మినహా 317492 క్వింటాళ్ల ధాన్యం ఇవ్వాల్సి ఉండగా 239381.60 మాత్రమే నిల్వ ఉంచి 78110.40 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించారని అధికారులు చెబుతున్నారు. మునుగోడు లోని మురళీ మనోహర ఆగ్రో ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ రైస్‌ మిల్లుకు 99277.60 ధాన్యం కేటాయించగా 44196.01 క్వింటాళ్ల సీఎంఆర్‌ బియ్యాన్ని అందించి 17807.89 ధాన్యం ఇవ్వాల్సి ఉండగా 13307.89 క్వింటాల ధాన్యం నిల్వ ఉంచి 4500 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదోవ పట్టించారు.

నల్లగొండ పట్టణంలోని సుమాంజలి రైస్‌ మిల్లులో ప్రభుత్వం 24,7221.20 క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించగా 54518.14 క్వింటాళ్ల సిఎంఆర్‌ బియ్యం అందించి 12,1991.12 ధాన్యం నిలువ ఉంచాలి. అయితే 54329.01 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే ఉంచి 6,7662.11 క్వింటాళ్ల ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారు. గౌతమి ఇండస్ట్రీస్ కి 21,7244.80 ధాన్యం కేటాయించగా 37,120 క్వింటాళ్ల సీఎంఆర్‌ బియ్యం అందించి 159803.92 క్వింటాళ్ల ధాన్యం ఇవ్వాల్సి ఉండగా మొత్తం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించారు. కనకమహాలక్ష్మి రైస్‌ ఇండస్ట్రీస్ కు 12,8562 క్వింటాళ్ల ధాన్యం కేటాయించగా 31,824.92 క్వింటాళ్ల సీఎఆర్‌ బియ్యం అందించి మిగతా 80,260.59 క్వింటాళ్ల ధాన్యం ఇవ్వాల్సి ఉండగా మొత్తాన్ని ఇవ్వకుండా పక్కదోవ పట్టించారు. కేతేపల్లి లోని కనకమహాలక్ష్మి రైస్‌మిల్లు లో 7811 మెట్రిక్‌ టన్నుల ధాన్యం పక్కదోవ పట్టినట్లు పౌరసరఫరాల అధికారులు గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో గుర్తించారు జిల్లాలోని ఏడు రైస్‌ మిల్లులో 192 కోట్ల విలువగల ధాన్యం బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్టు అధికారులు తెలిపారు.

నాలుగు సార్లు నోటీసులు..
ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్‌ మినహా బహిరంగ మార్కెట్లో టెండర్‌ ద్వారా దక్కించుకున్న గుత్తేదారుకు ఇవ్వాల్సిన ధాన్యాన్ని ఇవ్వకపోవడంతో డీటీసీఎస్‌, డీసీఎస్‌ తహసీల్దార్‌ , హైదరాబాద్‌ ఈటిఎఫ్‌ బృందం నేరుగా ఆ రైస్‌ మిల్లులో తనిఖీ చేపట్టారు.192 కోట్ల రూపాయలు విలువ గల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ధాన్యానికి సంబంధించిన 192 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించాలని యజమానులు కోరినప్పటికీ ఇవ్వకపోవడంతో 5 మాసాలుగా ఆయా రైస్‌ మిల్లుల యజమానులకు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ 4 సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా ఎలాంటిస్పందనా లేకపోవడంతో చిట్యాల, మునుగోడు, నల్లగొండ, కేతపల్లి పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాం : పౌరసరఫరాల శాఖ డిఎం రంపతి
ప్రభుత్వానికి అందించాల్సిన ధాన్యం నిలువలను సకాలంలో ప్రభుత్వానికి అప్పగించడంలో విఫలమవ్వడంతోపాటు మిల్లుల నిర్వాహకులు బయట అమ్ముకున్నట్టు తేలింది. ఉన్నతాధికారుల సూచనతో చట్టపరమైన చర్యల కోసం పోలీసులను ఆశ్రయించాం. పెనాల్టీ, సంవత్సరానికి12శాతం వడ్డీ సహా, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన జరిగినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -