– నాణ్యత లేదని కొనుగోళ్లు నిలిపివేత
– ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతుల నిరసన
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
పత్తిని ఎలాంటి కొర్రీలు లేకుం డా పూర్తిస్థాయిలో సీసీఐ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వ్యవసాయ మార్కెట్ యార్డులోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన పత్తిని సీసీఐ అధికారులు నాణ్యత లేదని పాసింగ్ చేయకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఈనెల 20న కొనుగోళ్ల గడువును సీసీఐ పెంచడంతో రైతులు కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని, మార్కెట్ యార్డుకు పత్తిని తీసుకువచ్చారు. అయితే అక్కడ సీసీఐ అధికారులు మొదటి బండి కాంటా చేసి ఇతర వాహనాలను నాణ్యత లేదని పాసింగ్ ఇవ్వలేదు. దాంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ మాట్లాడారు.
పత్తిని మార్కెట్కు తీసుకువచ్చిన తర్వాత సీసీఐ అధికారులు నాణ్యత పేరిట కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా 10 నుంచి 12 క్వింటాళ్లు రావాల్సిన పత్తి దిగుబడి, నాలుగైదు క్వింటాళ్లకు పడిపోయిందని తెలిపారు. నిన్నటి వరకు వాతావరణం బాగానే ఉందని, సోమవారం తెల్లవారు జామున వర్షం పడిందన్నారు. కొనుగోలు గడువు పెంచడంతో తాము పత్తి వాహనాలను తీసుకవచ్చామన్నారు. సీసీఐ అధికారులు నాణ్యత లేదని చెప్పడం సరైంది కాదన్నారు. పత్తి పూర్తి నాణ్యతగా ఉందని, సీసీఐ అధికారులు ఎలాంటి ఆంక్షలు విధించకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కొర్రీలు లేకుండా పత్తి కొనాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



