Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు : కేటీఆర్‌

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు : కేటీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తన పేరుతో ఎలాంటి సంస్థను కూడా ఏర్పాటు చేసేందుకు తన అనుమతి లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) స్పష్టం చేశారు. కొంతమంది ‘కేటీఆర్‌ సేవా సమితి’, కేటీఆర్‌ సేన పేరుతో కొన్ని కార్యకలాపాలు చేపడుతున్న విషయం ఆయన దృష్టికి పలువురు తీసుకొచ్చారు. దీంతోపాటు కేటీఆర్‌ పేరుతో ఇతర సంస్థలను ఏర్పాటు చేసుకున్న అంశంపై సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తన పేరుతో ఎలాంటి సంస్థలకీ అనుమతి లేదని తెలిపారు. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలకు ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదనే విషయాన్ని అందరూ గుర్తించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.
ఎవరైనా పనిచేయాలనుకుంటే ఖచ్చితంగా బీఆర్‌ఎస్‌ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను ఆపాలనీ, తనపై అభిమానం ఉన్నవాళ్లు ఎవరైనా బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయొచ్చని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -