Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనడిగడ్డ సీడ్‌ పత్తి రైతులకు బకాయిలు చెల్లించాలి

నడిగడ్డ సీడ్‌ పత్తి రైతులకు బకాయిలు చెల్లించాలి

- Advertisement -

– 15లక్షల మంది రైతుల రుణమాఫీ ఎగొట్టిన ప్రభుత్వం
– నన్ను బీఆర్‌ఎస్‌ సస్పెండ్‌ చేస్తే వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా : రైతు సంఘర్షణ సభలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
– జోగులాంబ గద్వాల కలెక్టరేట్‌ గేటుకు తాళం వేసిన పోలీసులు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.15 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నడిగడ్డ సీడ్‌ పత్తి రైతులకు బకాయిలు చెల్లించాలని తెలిపారు. తనను బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేస్తే వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వందలాది మంది రైతులతో పాదయాత్రగా గద్వాల కలెక్టరేట్‌కు రైతులతో కలిసి కవిత చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు గేటుకు తాళం వేశారు. దాంతో కలెక్టరేట్‌ ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆమె మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్‌లో కులం పేరుతో దూషించి కొట్టటంతో రెండు నెలల చిన్నారి చనిపోయిన ఘటన చాలా బాధ కలిగించిందన్నారు. తెలంగాణ జాగృతి తరపున భవిష్యత్‌లో ఏ కార్యక్రమం జరిగినా జోగులాంబ గద్వాల నుంచే ప్రారంభిస్తానని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులదే కీలక పాత్ర అని, ఈ ప్రాంతంలో పెట్టే సభకు రావాలని రంజిత్‌ తనను ఆహ్వానించాడని చెప్పారు. ఇక్కడి సీడ్‌ పత్తి విత్తనమే దేశం మొత్తం వెళ్తుందని, కానీ కంపెనీలు మాత్రం రైతులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నా యని ఆరోపించారు. బకాయిలు చెల్లిస్తామంటూ కలెక్టర్‌ ముందు ఒప్పుకున్నా.. తర్వాత ఇవ్వటం లేదన్నారు. ఇప్పటికైనా సీడ్‌ పత్తి రైతులకు వారం రోజుల్లో బకాయిలు విడుదల చేయాలని, లేదంటే రైతులందరితో కలిసి దీక్ష చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి 25 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేశారన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో నారాణయ పేట్‌ దగ్గర మా తమ్ముడు గవినోళ్ల శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. సర్పంచ్‌ ఎన్నికల్లో జాగృతి బోణీ కొట్టింద న్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా వడ్డెపల్లిలో గెలిచామని, గద్వాల్‌ నుంచే జాగృతి జైత్రయాత్ర మొదలైందన్నారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జాగృతిని ఆదరించాలని, డబ్బు మూటలతో వచ్చేవారిని నమ్మొద్దని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -