Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోలీసులపై అసత్య ప్రచారం

పోలీసులపై అసత్య ప్రచారం

- Advertisement -

– ఫేక్‌ న్యూస్‌పై హరీశ్‌రావు ఆగ్రహం
– బాధ్యులపై డీజీపీ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పోలీసు వ్యవస్థపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఫేక్‌ వార్తలను సృష్టించి, సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. తన పేరుతో సర్క్యులేట్‌ అవుతున్న న్యూస్‌ క్లిప్పింగ్‌ పూర్తిగా అబద్ధమనీ, అది ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేలా ఉందని సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు ఇలా వ్యవహరిస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదనీ, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండ చూసుకునే ఈ ఫేక్‌ న్యూస్‌ ముఠాలు ఇలా రెచ్చిపోతున్నాయని విమర్శించారు. ఈ ఫేక్‌ వార్తలకు కారణమైన వారిని వెంటనే గుర్తించి, డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను, పోలీసులను తప్పుదోవ పట్టించే ఇలాంటి తప్పుడు వార్తలు మంచిది కాదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -