Friday, June 26, 2026
E-PAPER
Homeఆటలుజర్మనీపై ఈక్వెడార్ ఘన విజయం.. ఆ దేశ అధ్యక్షుడు వింత నిర్ణయం

జర్మనీపై ఈక్వెడార్ ఘన విజయం.. ఆ దేశ అధ్యక్షుడు వింత నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: FIFA ప్రపంచ కప్ టోర్నీలో ఈక్వెడార్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన జర్మనీని 2-1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. ఈ విజయంతో ఈక్వెడార్ ‘గ్రూప్ E’ లో నాకౌట్ దశకు అర్హత సాధించింది.ఈక్వెడార్ ప్రారంభ మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ చేతిలో 1-0తో ఓడిపోవడం, రెండో మ్యాచ్‌లో కురాకోతో గోల్స్ లేకుండా డ్రా చేసుకోవడం వంటి ఫలితాల తర్వాత ఈక్వెడార్ ఈ మ్యాచ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే అర్హత సాధించిన జర్మనీతో తలపడేటప్పుడు బలహీనమైన జట్టుగా పరిగణించబడినప్పటికీ, వారు అద్భుతమైన ప్రదర్శనతో 2-0 విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ విజయం సందర్భంగా ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా వింత నిర్ణయం తీసుకున్నారు. విమర్శలు, క్లిష్ట పరిస్థితులను అధిగమించి దేశానికి గర్వకారణమైన ఆనందాన్ని అందించినందుకు ఆటగాళ్లు, కోచ్ సెబాస్టియన్ బెక్కాసెస్‌లకు అధ్యక్షుడు డేనియల్ నోబోవా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వారి విజయాన్ని పురస్కరించుకుని జాతీయ సెలవు దినాన్ని (శుక్రవారం నాడు) ప్రకటించారు.

“Thanks to the players and the coach who, despite the criticism, the insults, and the tough times they went through, managed to bounce back and bring this immense joy to the entire country. Tomorrow, holiday! Long live Ecuador,” he said in the X post.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -