Tuesday, February 24, 2026
E-PAPER
Homeజిల్లాలుసైబర్‌ క్రైమ్‌ల‌పై హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్‌

సైబర్‌ క్రైమ్‌ల‌పై హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ పేరుతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు భారీ ఆపరేషన్‌ చేపట్టారు. మొత్తం 16 రాష్ట్రాల్లోని 104 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. 32 బఅందాలతో 16 రాష్ట్రాల్లో 10 రోజుల పాటు ఈ ఆపరేషన్‌ కొనసాగింది. నిందితులపై దేశవ్యాప్తంగా 1,055 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు వీరు పలు సైబర్‌ నేరాల్లో రూ.127 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వారి నుంచి రూ.36 లక్షల నగదుతో పాటు 204 మొబైల్‌ ఫోన్లు, 141 సిమ్‌కార్డులు, 152 బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, 234 డెబిట్‌ కార్డులు, 26 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -