Tuesday, February 24, 2026
E-PAPER
Homeజిల్లాలుఅకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన డీఏఓ

అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన డీఏఓ

- Advertisement -

నవతెలంగాణ –  మిరుదొడ్డి 
ఇటీవల కురిసిన అకాల వర్షానికి అందె, కొండాపూర్ మిరుదొడ్డి, ధర్మారం గ్రామాలలో మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు పంటలు నష్టపోయిన పంటలను జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి, ఏ డి ఏ మల్లయ్య, మండల వ్యవసాయ అధికారి మల్లేశం లు పంటలను పరిశీలించారు. మండలంలో విస్తరణ అధికారులు ప్రాథమికంగా అందె-280, కొండాపుర్-88 మిరుదొడ్డి -373, ధర్మారం-53 ఎకరాలలో నష్టం జరిగినట్టు అంచనా వేయడం జరుగుతుందని సూచించారు. యొక్క నష్టపోయిన పంటల వివరాలను ఉన్నత అధికారులకు పంపిస్తామని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లు అఖిల్, రేఖ తోపాటు రైతులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -