Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐవిఎఫ్ బాధితులకు అండగా ఉంటుంది

ఐవిఎఫ్ బాధితులకు అండగా ఉంటుంది

- Advertisement -

– పదివేల విలువైన ప్రోటీన్ పౌడర్ అందజేత
– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
నవతెలంగాణ – కామారెడ్డి 

ఐవిఎఫ్ బాధితులకు అండగా ఉంటుందనీ బాలు తెలిపారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో రక్తహీనతతో బాధపడుతున్న మహిళల కోసం జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ సూచనల మేరకు పదివేల రూపాయల విలువైన ప్రోటీన్ పౌడర్ ను జిల్లా కార్యదర్శి,జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ నాగరాణి కి ఐవిఎఫ్ యువజన విభాగం నాయకులు ఎర్రం చరణ్ గుప్త, ఎర్రం ఈశ్వర్ గుప్తా సహకారంతో అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని పేదలు,బాధితులకు ఎల్లవేళలా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్)అండగా ఉంటుందని, ఐవిఎఫ్ సెంట్రల్ అడ్వజరీ బోర్డ్ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, ఐవిఎఫ్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  మార్గదర్శకత్వంలో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. మానవ జీవితానికి సేవతోనే సార్ధకత ఉంటుందని, ఆ మార్గంలోనే ఐవిఎఫ్ పనిచేస్తుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ వంచ చంద్రసేన్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -