Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకల సందర్భంగా యూత్ కాంగ్రెస్ పార్టీ తాడిచెర్ల గ్రామశాఖ అధ్యక్షుడు ఇందారపు రాకెష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. తాడిచెర్ల ఎస్సికాలని ప్రాథమిక, రామారావుపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వారు నేరుగా అందించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కేశారపు సురేందర్,జంజర్ల ప్రశాంత్,రంజిత్,ఆకుల రాకెష్,గుగ్గిళ్ల రాజ్ కుమార్,ఆకాష్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -