Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ పూజా సామాగ్రి వేలం పాట

ఆలయ పూజా సామాగ్రి వేలం పాట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల్లో ప్రఖ్యాతగాంచిన మద్నూర్ మండలంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణంలో పూజా సామాగ్రి అమ్మడానికి మంగళవారం వేలం పాట నిర్వహించారు. ఈ వేలంపాటలో కృష్ణ పాండ్రే రూ.5,22 000లకు దక్కించుకున్నారు. అదేవిధంగా ఆలయ భూమి కౌలు వేలం పాటలో బండు మైసజీ రూ.52 వేలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాట నిర్వహించేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ నుండి ఇన్స్పెక్టర్ కమలాబాయి హాజరయ్యారు.

వీరి సమక్షంలో జరిగిన వేలంపాటలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ సలాబత్పూర్ గ్రామ సర్పంచ్ దిగంబర్ పాలకవర్గం సభ్యులు పాల్గొనగా వేలంపాటలు భక్తులు పాల్గొన్నారు. పూజా సామాగ్రి వేలంపాట ఐదు లక్షల నాలుగు వేలు ఉండగా ఏడాది రూ.18000 పెరిగింది. పూజా సామాగ్రి వేలంపాట రెండు సంవత్సరాలకు గానూ నిర్వహించారు. ప్రతి సంవత్సరం రూ. 5 లక్షల ఇరవై రెండు వేలు కట్టవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. వేలం పాట పూర్తి కాగానే పూజా సామాగ్రి వేలంపాట వ్యక్తి సగం డబ్బులు చెల్లించారు. చేను కౌలు మొత్తం డబ్బులు చెల్లించారని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -