ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్.. ఈరవత్రి రాజశేఖర్
నవతెలంగాణ – ఆర్మూర్
ఇంటర్ విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రేపటి నుండి తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్నాయని, ఈ నేపథ్యంలో పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు ఐదు విజయ సూత్రాలను తెలియజేశారు. విద్యార్థులకు ఇంటర్ విద్య ఎంతో కీలకమని, శ్రద్ధగా చదువుకొని పరీక్షలు బాగా రాయాలని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరేలా విద్యార్థులకు పలు రకాల విషయాలపై మార్గదర్శకం చేశారు. ఇంటర్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్ విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



