- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శారాజిపేట గ్రామానికి చెందిన క్రీడాకారులకు యువతకు శాలివాహన సంఘం మండల ఉపాధ్యక్షులు శనిగరం హరీష్ రూ.3000 విలువ చేసే వాలీబాల్, నెట్ కిట్లను మంగళవారం అందజేశారు. యువతకు క్రీడా కిట్లతో సహాయ సహకారాలు అందించినందుకు గ్రామ ప్రజలు అభినందించారు. తన వంతు సహాయంగా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో రాహుల్, రాజు, అనిల్, సునీల్, శ్రీను, భరత్, నరేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



