నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆదిలాబాద్ జైలులో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలనను పూర్తిగా గాలికొదిలేసి, దోపిడీయే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
ప్రభుత్వం ఏర్పడి తర్వాత ఢిల్లీకి ఇచ్చేందుకు సీఎం వద్ద వెయ్యి కోట్లు సిద్ధంగా ఉన్నాయంటే, రాష్ట్ర ప్రజల సొమ్మును ఇంకెన్ని వేల కోట్లు మింగేశారో అర్థం చేసుకోవాలని అన్నారు. “ఆ వెయ్యి కోట్లు నీ అయ్యా సొమ్మా? లేక నీ అబ్బ సొమ్మా? ఎక్కడి నుంచి తెచ్చావు?” అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా ప్రశ్నించారు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకుని గాంధీ కుటుంబానికి కప్పం కడతారా అంటూ మండిపడ్డారు.



