Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యార్థులు అవగాహన కల్పించాలి: ఎస్సై

రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యార్థులు అవగాహన కల్పించాలి: ఎస్సై

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యార్థులు తమ ఇరుగుపొరుగు వారికి, తల్లిదండ్రులకు ట్రాఫిక్ నియమాలు (హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, అతివేగం నివారణ, మైనర్ డ్రైవింగ్ నిషేధం)పై అవగాహన కల్పించాలని తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు నిర్వహించనున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం అరైవ్ ఆలైవ్ లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత”అనే సందేశాన్ని గ్రామాల్లో కాలనీల్లో ప్రచారం చేస్తూ,ప్రమాద రహిత సమాజ స్థాపనకు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం భాస్కర్, సహదేవ్, కానిస్టేబుల్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -