Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వపూర్ రిజర్వాయర్ కట్ట పనులు నిలిపివేత..

బస్వపూర్ రిజర్వాయర్ కట్ట పనులు నిలిపివేత..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో బస్వపూర్ రిజర్వాయర్ పనులు అడ్డుకొని, నిలిపివేశారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 2007 సంవత్సరంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారు. 16వ ప్యాకేజీ కింద బస్వాపురం రిజర్వాయర్ ను 0.8 టిఎంసి గా నిర్మించాలని ప్రతిపాదించి ప్రారంభించారు. తదనంతరం 2012 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో అప్పటి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు భవిష్యత్తు తరాల కోసం కాలేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి 16వ ప్యాకేజీ కింద ఉన్న బస్వాపురం రిజర్వాయర్ ను 11 టిఎంసిలకు పెంచి పనులు ప్రారంభించారు.

ప్రాజెక్టు పనులు ప్రారంభమై సుమారు 18 సంవత్సరాలు అవుతోంది. ఈ రిజర్వాయర్ లో మా గ్రామ భూములు సుమారుగా 1862 ఎకరాలు మా తాత ముత్తాతల నాటి నుండి మేము నిర్మించుకున్న మా స్థిర నివాసాలు ఇండ్లు సైతం కోల్పోతున్నాం. జీవనోపాధి కోసం వలవెళ్లిన వలస కార్మికులకు ఆర్ అండ్ ఆర్ ప్యాజేజి ఇవ్వాలి. ముంపునకు గురవుతున్న ఈ ఒక్క గ్రామానికి నష్టపరిహారాలు చెల్లించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలం అవుతున్నాయో అర్థం కావడం లేదు. ఈ ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న బిఎన్ తిమ్మాపురం గ్రామానికి రావాల్సిన నష్టపరిహారాలు చెల్లించాలని గత 18 సంవత్సరాలుగా పోరాడుతున్న రావాల్సిన నష్టపరిహారాలు పూర్తిగా రాలేదుమా గ్రామానికి సంబంధించిన ఇండ్ల నష్టపరిహారం, మా గ్రామ రైతులకు సంబంధించిన పట్టా, కబ్జా భూముల నష్టపరిహారం ఇంకా చెల్లించలేదని, గత ప్రభుత్వం కొంతమేరకు నష్ట పరిహారం చెల్లించిన, పూర్తి స్థాయిలో రాలేదనారు. భు  నిర్వాసితులకు నష్టపరిహారాలన్నీ చెల్లించే వరకు ప్రాజెక్టు పనులు కొనసాగనివ్వమని గ్రామస్తులు అందరము ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి ,చోక్ల తండా సర్పంచ్ రాజా రాం, ఉపసర్పంచ్ పిన్నెం శ్రీశైలం,మాజీ ఎంపిటిసి ఉడుత శారదా ఆంజనేయులు,మాజీ సర్పంచ్ పిన్నం లత రాజు, అన్నెపు రాములు, రావుల నందు, ఎడ్ల దర్శన్ రెడ్డి, జిన్న మల్లేశం వళ్ళందస్ పరమేష్,దొంకేన అశోక్,పిన్నం నారాయణ, లింగ రెడ్డి, జిన్న నర్సింహ,పాండు, హరిబాబు,అనిల్,బాబ,మహిపాల్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపిటిసిలు,మాజీ వార్డు సభ్యులు,భునిర్వాయితుల కమిటి సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -