Tuesday, February 24, 2026
E-PAPER
Homeఖమ్మంమొక్కల పెంపకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

మొక్కల పెంపకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

- Advertisement -

– టీజీఎఫ్ఎసీ జీఎం జీ స్కైలాబ్
నవతెలంగాణ – అశ్వారావుపేట

అటవీ అభివృద్ధి కార్పొరేషన్ సర్సరీలలో మొక్కల పెంపకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని టీఎఫ్డీసీ జీఎం జీ స్కైలాబ్ సిబ్బందికి సూచనలు చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తూగూడెం జిల్లాలోని పలు ప్లాంటేషన్లు, నర్సరీలను ఆయన పరిశీలించారు. ఆశ్వారావుపేట నర్సరీలో పలు దశల్లో పెరుగుతున్న మొక్కల నాణ్యతను పరిశీలించారు.మొక్కలను పెంచే విధానం,మొక్కల సంఖ్య, బెడ్ల నిర్వహణ ఆడిగి తెలుసుకున్నారు.గతంలో జనరేటర్,మౌళిక వసతుల సమస్యలు ఉండేవి వాటిని పరిష్కరించిన తర్వాత ఇంకేమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.కార్పొరేషన్ నర్సరీ పరిధిలోని సిబ్బంది వ్యక్తిగత టార్కెట్లను పరిశీలించారు.మొక్కల పెంపకం.. ప్లాంటేషన్ టార్గెట్లను చేరుకోవాలని సూచించారు. ఆయన వెంట సత్తుపల్లి డీఎం. ఆశ్వారావు పేట ప్లాంటేషన్ మేనేజర్ చంద్రకళ, ఏపీఎం తిరుపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -