Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు ప్రారంభం

వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గెలుపొంది బాధ్యతలు చేపట్టిన వార్డు సబ్యులకు శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమైయ్యాయి. మండలంలో అన్ని గ్రామాల్లోని వార్డు సభ్యులకు తాడిచెర్ల రైతువేదికలో 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం శిక్షణ తరగతులు ఎంపిడిఓ క్రాంతి కుమార్ ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులు ఈ నెల 28వరకు కొనసాగనున్నట్లుగా తెలిపారు. శిక్షణ తరగతులతో వార్డు సభ్యులకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అందులో తమ పాత్ర,ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేయాల్సిన విధులు, బాధ్యతలు తెలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ నిర్వాహకులుగా పంచాయతీ కార్యదర్శులు సాంబశివుడు, సాయి చరణ్, స్వామి, శివ ప్రసాద్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,వా ర్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -