Tuesday, February 24, 2026
E-PAPER
Homeఖమ్మంరైతుబంధు ఎగ్గొట్టి అన్నదాతలను వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రైతుబంధు ఎగ్గొట్టి అన్నదాతలను వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

- Advertisement -

– బీఆర్‌ఎస్ నాయకులు ధ్వజం
– తిరుమలకుంటలో రైతుబంధు నిధుల విడుదలకై నాయకులు డిమాండ్ 
– మాయమాటలతో రైతులను వంచిస్తున్నారు
– బిఆర్ఎస్ మండల అధ్యక్షులు జుజ్జురి వెంకన్నబాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట 

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు రైతులను నట్టేట ముంచిందని బీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు జుజ్జూరపు వెంకన్న బాబు మండిపడ్డారు.  ఈ మేరకు బుధవారం మండలం లో ని తన సొంత గ్రామం తిరుమలకుంట లో పలువురు నాయకులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు రైతులను నట్టేట ముంచిందని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఎకరానికి ఏడాదికి 10 వేల రూపాయలను ఎన్నడూ ఆలస్యం చేయకుండా అందించేవారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పారని విమర్శించారు. ఇప్పటివరకు నాలుగు దఫాలుగా నిధులు అందాల్సి ఉండగా, కేవలం ఒక్క దఫా మాత్రమే ఇచ్చి మిగిలిన మూడు దఫాలను ఎగ్గొట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు పెట్టుబడి కోసం రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో ఇలా కాలయాపన చేయడం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కల్యాణలక్ష్మి, తులం బంగారం వంటి పథకాల్లోనూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఎకరానికి ఏడాదికి 10 వేల రూపాయలను ఎన్నడూ ఆలస్యం చేయకుండా అందించేవారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పారని విమర్శించారు. ఇప్పటివరకు నాలుగు దఫాలుగా నిధులు అందాల్సి ఉండగా, కేవలం ఒక్క దఫా మాత్రమే ఇచ్చి మిగిలిన మూడు దఫాలను ఎగ్గొట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు పెట్టుబడి కోసం రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో ఇలా కాలయాపన చేయడం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కల్యాణలక్ష్మి, తులం బంగారం వంటి పథకాల్లోనూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

రైతులకు అందాల్సిన రైతుబంధు (రైతు భరోసా) నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమలకుంట గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రైతులను వడ్డీ వ్యాపారుల చేతుల్లో పెట్టారు: బిఆర్ఎస్ నాయకులు కొనాకళ్ల శ్రీనివాస్
మరో నాయకులు కొనాకళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మళ్లీ వడ్డీ వ్యాపారుల కబందహస్తాల్లోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వకుండానే 2018లో రైతుబంధు పథకాన్ని తెచ్చి, కోటి 44 లక్షల మంది రైతులకు వెన్నుదన్నుగా నిలిచారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా జూన్ మొదటి వారం మరియు సంక్రాంతి లోపు నిధులు ఖచ్చితంగా జమయ్యేవని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల పేరుతో కాలయాపన చేస్తూ, కేబినెట్ సమావేశాల్లో కూడా రైతు భరోసాపై చర్చించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఇవ్వాల్సిన 15 వేల రూపాయల సాగు సాయాన్ని విడుదల చేయాలని, లేనిపక్షంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జుజ్జురి సత్యనారాయణ, జుజ్జురి కొమరయ్య, పానుగంటి లక్షణరావు, సున్నం రామ లక్ష్మయ్య, నారం నాగలక్ష్మి, భూబత్తుల చెన్నారావు, పానుగంటి వీరభద్రం, కోర్స చెన్నారావు, మడకం ముత్యాలరావు, వెంకన్నబాబు కోర్సా వినోద్, సమాధానం, జగనద్దాం , పానుగంటి చెన్నకేశవులు, చిందిరాల శ్రీకాంత్, పానుగంటి వేణు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -