నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మహిళల పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు నిషేధం, పరిష్కారం చట్టం-2013 పోష్ యాక్ట్ అమలు కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయ, సంస్థ, విద్యా సంస్థ , పరిశ్రమ, ఇతర సంస్థల్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏర్పాటు చేయడం తప్పనిసరి. జిల్లాస్థాయిలో లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఏర్పాటు చేయబడింది.10 మందికి తక్కువ సిబ్బంది ఉన్న సంస్థలో లేదా ఇంటర్నల్ కమిటీ లేని సంస్థలలో మహిళలు జిల్లా లోకల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చనారు.
మహిళలు తమ ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం షీ బాక్స్ పోర్టల్ ( https://shebox.wcd.gov.in) ను అందుబాటులో ఉంచింది. అలాగే జిల్లాలోని అన్ని ప్రైవేట్ సంస్థలు తమ సంస్థలో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ వివరాలను తప్పనిసరిగా షి బాక్స్ పోర్టల్ లో తమ్ముడు చేసి అప్డేట్ చేయవలెను. ఈ చట్టం అమలుకు సంబంధించి మండల, మున్సిపల్ స్థాయిలో నోడల్ అధికారులు నియమించడం జరుగుతుందని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పోష్ యాక్ట్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మహిళలు తమ సమస్యలపై నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా కోరారు.
dwoyadwcdsc@ gmail.com లేదా dnewyadadri@ gmail.com ను సంప్రదించవచ్చుని సూచించారు.



