నవతెలంగాణ -ఆత్మకూరు
ద్విచక్ర వాహనదారులు నిత్యం హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరుకోవాలని వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ సూచించారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అండ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేశారు. అనంతరం ఆత్మకూర్ పోచమ్మ సెంటర్ నుండి గుడెప్పడ్ జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
అంతకు ముందు నిర్వహించిన సమావేశంలో డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో అత్యధికంగా హెల్మెట్ ధరించని వారే మృత్యువాత పడుతున్నారని, హెల్మెట్ ధరించడం వ్యక్తిగతంగా సురక్షితంగాను వారి కుటుంబానికి రక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపిఎస్ మనీషా నెహ్రా, పరకాల ఎసీపి సతీష్ బాబు, సీఐ ఆర్ సంతోష్, ఎస్సై తిరుపతి, పోలీస్ సిబ్బంది , స్థానిక సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, కాంగ్రెస్ సేవా దల్ అధ్యక్షులు ఏరుకొండ రవీందర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


