- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఉపాధిహామీ మండలి(టిజిఎస్ ఈజిసి) 9వ సమావేశం హైదరాబాద్ లోని మిషన్ భగీరథ సమావేశం హాల్లో మంగళవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సితక్క అధ్యక్షతన ,పిఆర్డీ కమిషనర్,పంచాయతీ ప్రిన్స్ పల్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టిఎస్ ఈజిసి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (ఈజిఎస్) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కూలీల పొట్టకొట్టేందుకు తీసుకొస్తున్న విబిజి రామ్ జి చట్టం రద్దు,కూలీలకు కడుపునిండా బువ్వపెట్టె పనులపై చర్చించినట్టుగా తెలిపారు. అనంతరం రమేష్ మంత్రి సితక్కకు పుష్పగుచ్ఛం అందజేశారు.
- Advertisement -



