Wednesday, February 25, 2026
E-PAPER
Homeసినిమాభిన్న ప్రేమకథతో 'బ్యాండ్‌ మేళం'

భిన్న ప్రేమకథతో ‘బ్యాండ్‌ మేళం’

- Advertisement -

‘కోర్ట్‌’ ఫేమ్‌ హర్ష్‌ రోషన్‌, శ్రీదేవీ జంటగా మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌ మీద కోన వెంకట్‌ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్‌ మేళం’. సతీష్‌ జవ్వాజీ దర్శకుడు.
కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ సినిమాని మార్చి 13న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం టీజర్‌ను రిలీజ్‌ చేశారు.
ఈ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి తమన్‌, శివాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. శివాజీ మాట్లాడుతూ,’ఈ సినిమా మంచి లవ్‌ స్టోరీతో తెరకెక్కింది. ఇందులో కూడా నన్ను ఓ పాత్ర చేయమని అడిగారు. కానీ రొటీన్‌ అవుతుందని వద్దని చెప్పాను. శ్రీదేవీ చాలా మంచి నటి. రోషన్‌ మంచి టాలెంట్‌ ఉన్న యాక్టర్‌. భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్తాడు. ‘కోర్ట్‌’ మార్చి 13న ప్రీమియర్‌ వేసి హిట్టు కొట్టాం. ఇప్పుడు ఈ సినిమా కూడా మార్చి 13న రాబోతోంది. ఇది కూడా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘కోన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ‘దూకుడు’తో నా కెరీర్‌ ఇంకా కొనసాగుతూనే వెళ్తోంది. హర్ష్‌ రోషన్‌, శ్రీదేవీలను చూస్తుంటే నాకు ‘నువ్వే కావాలి’ రోజులు గుర్తుకు వస్తున్నాయి. నాకు విజరు బుల్గానిన్‌ పాటలంటే చాలా ఇష్టం’ అని తమన్‌ చెప్పారు.
కోన వెంకట్‌ మాట్లాడుతూ,’గుండెలోంచి వచ్చే ప్రేమ కథకు ఎలాంటి ఆదరణ దక్కుతుందని ‘నిన్ను కోరి’తో తెలిసింది. ఈ ‘నిన్ను కోరి’ వల్లే ఇప్పుడు ‘బ్యాండ్‌ మేళం’ నిర్మించాను. నాని ఫిల్మోగ్రఫీలో ‘నిన్ను కోరి’ ఓ మెమరబుల్‌ ఫిల్మ్‌గా నిలిచింది. శివ నిర్వాణ ఈ కథను గుండెతో చెప్పాడు. నాకు సతీష్‌ ఈ కథను చెప్పినప్పుడు కూడా అదే ఫీలింగ్‌ కలిగింది. ఈ కథలోని సంఘర్షణ చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్‌ అందరినీ కట్టి పడేస్తుంది. ఏజ్‌, యాక్టింగ్‌ సత్తా ఉండటం వల్లే రోషన్‌, శ్రీదేవీలను తీసుకున్నాం. సాయి కుమార్‌ ఈ కథ విని షాక్‌ అయ్యారు. విజరు బుల్గానిన్‌ మాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మార్చి 13న ఈ చిత్రం రాబోతోంది. అందరూ సక్సెస్‌ చేసి ఇంకా కొత్త వారిని పరిచయం చేసే శక్తిని, సక్సెస్‌ను అందిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -