– ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
– హాజరు కానున్న 9,97,075 మంది విద్యార్థులు
– 1,495 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 18వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందుకు సంబంధించిన ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు పరీక్ష ప్రారంభమయ్యాక ఐదు నిమిషాలు ఆలస్యం గా వచ్చినా అనుమతి ఉంటుంది. ఆ తర్వాత వస్తే అనుమతి ఉండదు. అయితే పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ పరీక్షలు రాసేందుకు రాష్ట్రంలో 9,97,075 మంది దరఖాస్తు చేశారు. ఇందులో ఇంటర్ ప్రథమ సంవ త్సరం నుంచి 4,89,126మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 4,53,932 మంది ఉన్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం 1,495 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను సజావుగా, పకడ్బందీగా నిర్వహిం చేందుకు జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ)తో పాటు జిల్లాస్థాయి హైపవర్ కమిటీ లను ప్రభుత్వం నియమించింది. ఫ్లయింగ్ స్క్వాడ్ లు, సిట్టింగ్ స్క్వాడ్స్‌లను ఇంటర్ బోర్డు నియమించింది. పరీక్షల సమయంలో విద్యా ర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆయా కమిటీలు చర్యలు తీసుకుంటాయి. అవసర మైన రవాణా సదుపాయాలు, పరీక్షల సమ యంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ ఎయిడ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం తొమ్మిది నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా పోలీస్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటారు. దాదాపు 7,500 సీసీ కెమెరాల ద్వారా పరీక్షల నిర్వహణను ఇంటర్ బోర్డు పర్యవేక్షించనుంది. పరీక్షల నిర్వహణ లో భాగంగా స్టేట్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. 040-2465 5027 లేదా 9402 05555 నెంబర్లను సంప్రదించవచ్చు. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు నిరంతరా యంగా నిపుణులైన కౌన్సిలర్లు, ఉచిత మానసిక ఆరోగ్య సహాయం అందించను న్నారు. విద్యార్థులు టోల్‌ఫ్రీ నెంబర్ 14416 లేదా 80693 91416 నెంబర్లను సంప్రదించాలి.
నేలపై కూర్చొని పరీక్షలు రాయొద్దు : సీఎస్
రాష్ట్రంలో జరిగే ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావు ఆదేశించారు. విద్యార్థులకు ప్రరీక్ష ప్రారంభం అయ్యాక ఐదు నిమిషాల వరకు హాజరయ్యేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణా రావు మాట్లాడుతూ బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు, వచ్చేనెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణలో ఏవిధమైన అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వ హించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈసారి పరీక్షలకు నిర్ణీత సమయాని కన్నా ఐదు నిమి షాల తర్వాత కూడా పరీక్ష కేంద్రాలకు విద్యా ర్థులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నా మని వివరించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలనీ, గతంలో ఉన్న వివాదాస్పద పరీక్షా కేంద్రాలపై మరింత దృష్టి సారించాలని కోరారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కనీస సౌకర్యా లైన తాగునీరు, విద్యుత్, టాయిలెట్‌ల సౌక ర్యాలు కల్పించడం తో పాటు సీసీటీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక ఏఎన్‌ఎం, ఫస్ట్ ఎయిడ్ కిట్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఏ ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చొని పరీక్ష రాయకూడదనీ, అన్ని కేంద్రాల్లో బెంచీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యా శాఖ అధికారులు కాకుండా ఇతర శాఖల అధికారులతో సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర విద్య శాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను అనుమతిం చడం లేదని చెప్పారు. ఛీప్ సూపరింటెం డెంట్‌కు మాత్రమే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సెల్‌ఫోన్ ఉపయోగించడానికి అనుమతిస్తు న్నామని అన్నారు. ప్రతీ కేంద్రం వద్ద మొదటి సారిగా గడియారాలను ఏర్పాటు చేస్తున్నా మని చెప్పారు. అవకతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రతీ ప్రశ్నాపత్రానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్, సీరియల్ నెంబర్ ఉంటుందనీ, పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు మాత్రమే వాటిని తెరవాలని స్పష్టం చేశారు. ఈసారి విద్యార్థుల హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా పంపడమే కాకుండా వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



