– ఫార్మాసిస్ట్‌గ్రేడ్-2 రిక్రూట్‌మెంట్ ప్రొవిజనల్ మెరిట్ విడుదల చేయాలి
– టీజీయూఎమ్‌హెచ్‌ఈయూ (సీఐటీయూ అనుబంధం) డిమాండ్
– ప్రజావాణి ఇన్‌చార్జి దివ్యదేవరాజన్, అధికారులకు వినతిపత్రాల అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఏఎన్‌ఎమ్‌ల సమస్యలను పరిష్కరించాలనీ, ఎమ్‌హెచ్‌ఎస్‌ఆర్‌బీ ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 రిక్రూట్‌మెంట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టును వెంటనే విడుదల చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్, రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌డీ.ఫసియొద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో టీజీయూఎమ్‌హెచ్‌ఈయూ ఆధ్వర్యంలో ప్రజావాణి ఇన్‌చార్జి దివ్యదేవరాజన్, ఇతర అధికారులకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఎమ్‌హెచ్‌ఎస్‌ఆర్‌బీ నోటిఫికేషన్ కింద 30.11.2024న సీబీటీ నిర్వహించారనీ, ఇప్పటివరకూ మెరిట్ లిస్టు ఇవ్వలేదని వారు అధికారుల ఎదుట ఎత్తిచూపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఫార్మాసిస్టులు 15 నుంచి 20 ఏండ్ల సర్వీసు చేసినవారు కూడా ఉన్నారనీ, వారిని ప్రతి ఏటా ఆర్థిక శాఖ ఆమోదంతో రెన్యూవల్ చేస్తూ పోతున్నారని తెలిపారు. వారు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సమయంలో సర్వీసు సర్టిఫికెట్లను కూడా అందజేశారని గుర్తుచేశారు. వారు సర్వీసు వెయిటేజీకి ముమ్మాటికి అర్హులని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీ 2018లో చేపట్టిన నియామకాల సందర్భంలోనూ సర్వీసు వెయిటేజీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సర్వీసు వెయిటేజీ ఇస్తూ మెరిట్ లిస్టులు విడుదల చేయాలని కోరారు. ఎమ్‌పిహెచ్‌ఏ(ఫీమేల్) పోస్టుల భర్తీ కోసం ఎమ్‌హెచ్‌ఎస్‌ఆర్‌బీ ద్వారా ప్రక్రియ వేగవంతం చేయాలనీ, ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేయాలని అధికారులను వారు కోరారు. కాంట్రాక్టు ఏఎన్‌ఎమ్‌లందరికీ గ్రాస్‌సాలరీ ఇవ్వాలనీ, పర్మినెంట్ ఏఎన్‌ఎమ్‌ల బేసిక్ సాలరీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రాట్యూటీ అమలు చేయాలనీ, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులందరి ఆరోగ్య భద్రతలో భాగంగా వారికి ఈహెచ్‌ఎస్ అమలు చేయాలని కోరారు. రూ.33 కోట్ల ఏరియర్స్ విడుదల చేయాలనీ, వారిపై పనిభారం తగ్గించాలని విన్నవించారు.
కాంట్రాక్టు ఏఎన్‌ఎమ్‌ల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



