అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులను ఆహ్వానించిన కొలనుపాక మాదిగ పెద్దలు
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీఆది జాంబవ మాదిగ మఠం పునర్ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి కొలనుపాక గ్రామ మాదిగ మఠం కుల గురువులు మాదిగ కుల పెద్దలు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ లోని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్యకు,సంఘ సభ్యులకు ఆహ్వాన పత్రికను అందించారు. మార్చి 6, 7, 8వ తేదీలలో జరిగే శ్రీఆదిజాంబవుడి విగ్రహ ప్రతిష్ట, మాదిగ మఠం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని వారు సంఘ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దానగళ్ళ యాదగిరి,బోడుప్పల్ అరుంధతి మాదిగ సంఘం అధ్యక్షుడు గరుగుల యాకయ్య,ఉప్పరి ప్రేమ్, కళ్యాణ్, రఘురూపుల మల్లేష్, చిల్ల అంజయ్య, కొలనుపాక మాదిగ కుల పెద్దలు మోత్కురి అయిలయ్య, కొలనుపాక మాజీ సర్పంచ్ గందమల్ల అశోక్, ఆలేరు మాజీ ఎంపిపి గందమల్ల నరేష్, కులపెద్ద మామిడాల బాలమల్లశ్, గ్రామ రజక సంఘం అద్యక్షులు యండి ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



