- Advertisement -
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
సుప్రసిద్ధ నవ్య సాహితి సమితి అమృతోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. సుల్తాన్ బజార్లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు బాషా నిలయంలో ఈ వేడుకలను ముఖ్య అతిథి, ప్రభుత్వ మాజీ సలహాదారులు డాక్టర్.కె.వి.రమణాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత వేమరాజు నరసింహారావు 1952లో సంస్థను స్థాపించి సాహితీ రంగానికి చేసిన కృషి అపూర్వమని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, సాహిత్యరంగ ప్రము ఖులతో కలిసి ఆధ్యాత్మికవేత్త వల్లూరి శ్రీరామచంద్రమూర్తిని సత్కరించారు. నవ్య సాహితీ సమితి అధ్యక్షులు డా. ఫణింద్రతో పాటు డా.వొలేటి పార్వతీశం, ఆచార్య గౌరీశంకర్, జి. వసుంధర తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



