– మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ శాఖ సానిటేషన్ జోన్ – 2 విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సానిటేషన్ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఆమె ఆదేశించారు. పట్టణ అభివృద్ధిలో సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు. పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ కాసార్ల గోదావరి స్వామి, కౌన్సిలర్లు గడ్డం మహేష్, నాగమణి విజయ భాస్కర్, కళ్లెం సావిత్రి సత్యం, లక్ష్మీ నారాయణ, మామిండ్ల లక్ష్మణ్, అన్వార్, నిట్టు గంగాధర్, సిద్ధిక్, బబులు, ఎస్ఐ నగేష్, వార్డ్ జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



