Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరద కాలువ గండి మరమ్మతు పనుల పురోగతి పరిశీలన

వరద కాలువ గండి మరమ్మతు పనుల పురోగతి పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఇందిరమ్మ వరద కాలువ గండి మరమ్మతు పనులను నాణ్యతతో చేయించాలని నీటిపారుదల శాఖ జగిత్యాల యూనిట్ ముఖ్య ఇంజనీర్ సుమతీ దేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మోర్తాడ్ మండలం గాండ్లపేట్ గ్రామ శివారులో ఇందిరమ్మ వరద కాలువకు గండి పడిన ప్రదేశంలో మరమ్మతు పనులలో భాగంగా కొనసాగుతున్న  నిర్మాణ పనుల పురోగతిని నీటిపారుదల శాఖ జగిత్యాల యూనిట్ ముఖ్య ఇంజనీర్ సుమతీ దేవి పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కార్య నిర్వాహక ఇంజనీర్ లాల్ సింగ్ ను అడిగి తెలుసుకున్నారు.

గండి మరమ్మతు నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా, పూర్తి నాణ్యతతో పనులు చేయాలని ఎస్ఎల్ఎన్ఎస్ సంస్థ ప్రతినిధిలకు సూచించారు. పనుల్ని తరుతగతిన పూర్తి చేసి వరద కాలువను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్న తీరు పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కాలువ ఉప కార్య నిర్వహక ఇంజనీర్ గణేష్, సహాయ ఇంజనీర్ రాము, ఎస్ఎల్ఎన్ఎస్ సంస్థ ప్రతినిధి చందు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -