Sunday, June 28, 2026
E-PAPER
Homeబీజినెస్కోటక్ మహీంద్రా బ్యాంక్ఎండి అశోక్ వాస్వాని రాజీనామా

కోటక్ మహీంద్రా బ్యాంక్ఎండి అశోక్ వాస్వాని రాజీనామా

- Advertisement -

న్యూఢిల్లీ : కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండి, సిఇఒ అశోక్ వాస్వాని తన పదవీ కాలం ముగిసిన తర్వాత తిరిగి బాధ్యతలు చేపట్టబోమని వెల్లడించారు. 2026 డిసెంబర్ 31తో ఆయన పదవీ కాలం ముగియనుండగా.. వ్యక్తిగత కారణాల దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ బ్యాంక్ శనివారం స్టాక్ ఎక్సేంజీలకు తెలియజేసింది. బోర్డు ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ తదుపరి ఎండి, సిఇఒ నియామక ప్రక్రియను ప్రారంభించింది. నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా కొత్త నాయకత్వాన్ని నియమిస్తామని బ్యాంక్ పేర్కొంది. బార్క్లేస్ మాజీ ఎగ్జిక్యూటివ్‌ అయిన వాస్వాని.. ఉదయ్ కోటక్ తప్పుకున్న తర్వాత 2024 జనవరి 1న మూడు సంవత్సరాల కాలపరిమితితో బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -