Saturday, June 27, 2026
E-PAPER
Homeజాతీయంజాతీయ మీడియాతో MDMK అధినేత వైకో కీలక వ్యాఖ్యలు

జాతీయ మీడియాతో MDMK అధినేత వైకో కీలక వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తొమ్మిదేళ్లుగా డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న వైకో నేతృత్వంలోని ఎండీఎంకే, తాము కూటమి నుంచి బయటకు వెళ్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డీఎంకేలో కొనసాగడం సాధ్యం కావడం లేదని, తమ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తోందని ఎండీఎంకే ఆరోపించింది. ఇదే కాకుండా, అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చేలా రహస్య ప్రణాళిక అమలు చేస్తున్న పరిస్థితుల్లో డీఎంకేతో కొనసాగలేమని చెప్పింది.1993లో డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తర్వాత, పలుమార్లు డీఎంకేతో పొత్తు కలుస్తూ, విడిపోతూ ఉన్నాడు. ఇప్పుడు మరోసారి డీఎంకేతో స్నేహానికి గుడ్ బై చెప్పారు. తాజాగా MDMK అధినేత వైకో ఓ జాతీయ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు.”DMK మమ్మల్ని అవమానించింది. ఇప్పటివరకు అన్ని అవమానాలను మేము భరించాము,” అని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -