అన్షు, వాసవి గణేషన్ జంటగా నటించిన చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడి యెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించారు. భిక్షు దర్శకుడు.
ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఈనెల 15న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను ఈనెల 10న విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు బిక్షు మాట్లాడుతూ ,‘మా సినిమాను 15న విడుదల చేస్తున్నాం. కానీ, బుక్ మై షోలో ఇప్పటి నుంచే టిక్కెట్స్ సేల్ చేస్తున్నాం. ఈ సినిమా చూసి అం దరూ మరొకరికి రికమెండ్ చేస్తారు. దర్శకుడు కావాలన్న నా డ్రీమ్ నెరవేరింది. ట్రైలర్ చూసిన తరువాత సినిమా మీద అందరి ఓపినియన్ మారిపోతుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా నచ్చి సపోర్ట్ చేస్తు న్నాను. తప్పకుండా ఈ సినిమా హిట్ కాబోతుందనే ఆత్మవిశ్వాసం అందరిలో కనిపిస్తుంది. సినిమా చూడగానే నాకు కూడా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. నిర్మాత సురేష్ బాబు చూసి, నచ్చి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. చాలా పెద్ద సినిమాల మధ్యలో వస్తుంది. సినిమా మీద నమ్మకంతోనే విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పతాక సన్నివేశాలు అందరి హృదయాలను హత్తుకుం టాయి. అన్ని వర్గాలకు నచ్చే సినిమా ఇది. ఇది కేవలం యూత్‌కే కాదు. మేసేజ్ ఉన్న కమర్షియల్ సినిమా. దర్శకుడు చాలా ఇంటలిజెంట్‌గా సినిమాను హ్యాండిల్ చేశాడు’ అని బెక్కెం వేణుగోపాల్ చెప్పారు.
అలరించే‘హుషార్ పిట్టలు’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



