నవతెలంగాణ-హైదరాబాద్ : ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట మంగళవారం హాజరయ్యారు. తనపై ఉన్న లుకౌట్ సర్క్యులర్ ఎత్తేస్తే తాను లండన్ వెళ్లిపోతానని ఆమె పోలీసులకు తెలిపారు. భర్త మధుకర్ భారత్ రాగానే ఆయనను విచారించాలని న్యాయవాదుల ద్వారా పోలీసులను కోరారు.డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తామంటూ మోసగించారని క్రాంతికుమార్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ నెల 8న ఇబ్రహీంపట్నం పోలీసులు విచారించినా ఆమె సహకరించలేదు. ఈ నెల 16న తిరిగి విచారణకు హాజరుకావాలని పోలీసులు మరో నోటీసు ఇచ్చారు. న్యాయవాదుల సూచనల మేరకు పోలీసులకు రిక్వెస్ట్ లెటర్ పంపి ఒకరోజు ముందే మంగళవారం స్టేషన్కు చేరుకొన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకూ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజులు విచారణ నిర్వహించారు. ఏం అడిగినా ఆమె సరైన సమాధానాలను ఇవ్వలేదని తెలుస్తోంది. గతంలో పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానాలు అందజేసినట్లు సమాచారం.
లుకౌట్ సర్క్యులర్ ఎత్తేస్తే లండన్ వెళ్లిపోతా : యూట్యూబర్ నందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



